అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన ఆ శ్రీనివాసుడిని దర్శించుకోవడానికి దేశ,విదేశాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. వాహనాల్లో వెళ్లే వారు ఘాట్ రోడ్డు ద్వారా తిరుమలకు చేరుకుంటుండగా, నడక మార్గం భక్తులు అలిపిరి, శ్రీవారి మెట్టు ద్వారా శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే అత్యంత ప్రాచీనమైన శ్రీవారి మెట్టు మార్గం భక్తులకు ఇప్పట్లో కష్టాలు తీరేలా లేవు. కలియుగ శ్రీనివాసుడు పై అపారమైన భక్తిభావంతో గోవిందనామాలు స్మరించుకుంటూ మొక్కుబడిగా మెట్టుమెట్టుకు నమస్కరించుకుంటూ వేల సంఖ్యలో భక్తులు పురాతన మార్గమైన నడకదారిలో…