న్యూఢిల్లీలో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 50 కిలోల విభాగం ఫైనల్స్‌లో బంగారు పతకం సాధించిన బాక్సర్ నిఖత్ జరీన్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అభినందించారు.
ప్రపంచ మహిళ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ మరో స్వర్ణం సాధించింది. 81 కేజీల విభాగం ఫైనల్‌లో చైనాకు చెందిన వాంగ్ లీనాపై సావీటీ బూరా విజయం సాధించి భారత్‌కు రెండో బంగారు పతకాన్ని అందించింది.