Womens World Cup Final 2025: నవీ ముంబైలోని డీవై పటిల్ స్టేడియంలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్ మ్యాచ్‌కి వేదిక సిద్ధమైంది. భారత మహిళల జట్టు, దక్షిణాఫ్రికా జట్టు మధ్య తలపడనున్న ఈ మ్యాచ్ చరిత్రాత్మకంగా మారనుంది. ఫైనల్ మ్యాచ్ ముందు భారీ వర్షం కారణంగా ఆట ప్రారంభం ఆలస్యమైంది. టాస్ మధ్యాహ్నం 2.30 గంటలకు జరగాల్సి ఉండగా.. తడిగా మారిన ఔట్‌ఫీల్డ్ కారణంగా దాదాపు రెండు గంటల ఆలస్యంతో టాస్ జరిగింది.…