వచ్చే నెలలో భారతh, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న మహిళల వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్‌లో ఐసిసి మార్పులు చేసింది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం నుండి ఆతిథ్యాన్ని ఐసిసి తొలగించి వేరే స్టేడియంకు మార్చింది. ఈ ప్రపంచ కప్ మ్యాచ్‌లకు మొత్తం ఐదు స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఆ స్టేడియాలలో ఒకటి బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం. దీనిలో ఇకపై మ్యాచ్‌లు జరగవు. బెంగళూరులో జరగాల్సిన మ్యాచ్‌లు ఇకపై నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరుగుతాయని…