ఆలుమగలు అన్నాక చిన్న.. చిన్న గొడవలు.. అలకలు సహజమే. అలా పోట్లాడుకుంటారు.. అంతలోనే కలిసిపోతుంటారు. ఇదంతా సంసార జీవితంలో కామన్‌గా జరుగుతూ ఉంటుంది. అయితే భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ.. యూపీలో ఒక మహిళ మాత్రం బిల్డింగ్ పైనుంచి కిందకు దూకేసింది.