బాంబ్ తుఫాన్ అగ్ర రాజ్యం అమెరికాను హడలెత్తిస్తోంది. అత్యంత శక్తివంతమైన సైక్లోన్ అనేక రాష్ట్రాలపై ప్రభావం చూపించనున్నట్లుగా తెలుస్తోంది. తీవ్రమైన గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అగ్రరాజ్యం అమెరికాపై మంచు తీఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ శీతాకాలపు తుఫాన్ ప్రభావంతో పలు రాష్ట్రాల్లో రవాణా సౌకర్యాలు పూర్తిగా నిలిచిపోయాయి. ముఖ్యంగా మిడ్‌వెస్ట్ చుట్టు పక్కల రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులకు గురైతున్నాయి.
అమెరికాలో పశ్చిమ రాష్ట్రమైన నెవాడాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. మెడికల్ ట్రాన్స్‌పోర్ట్ విమానం కుప్పకూలడంతో అందులో రోగితో పాటు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
మంచు తుఫాన్ ధాటికి అమెరికా అల్లకల్లోలం అవుతోంది. అమెరికాతో పాటు కెనడా కూడా మంచు తుపాన్ ధాటికి వణుకుతోంది. విపరీతమైన చల్లగాలులు వీస్తున్నాయి. ఈ శీతల గాలుల ప్రభావంతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు.
31 Dead After Winter Storm In US: అమెరికాను మంచు తుఫాను అల్లాడిస్తోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించారు. ముఖ్యంగా దేశంలోని తూర్పు ప్రాంతాలు మంచు తుఫాను ధాటికి ప్రభావితం అవుతున్నాయి. ఇప్పటి వరకు మంచు తుఫాన్ వల్ల 31 మంది మరణించారు. న్యూయార్క్ లోని బఫెలో ప్రాంతంలో సంక్షోభ పరిస్థితి ఏర్పడింది. మంచు తుఫాన్ కారణంగా న్యూయార్క్ నగరం అతలాకుతలం అవుతోంది. అత్యవసర సేవలపై హిమపాతం తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
క్రిస్మస్ పండుగ వేళ భయంకరమైన మంచు తుఫాను అగ్రరాజ్యమైన అమెరికాను ముంచెత్తింది. యునైటెడ్ స్టేట్స్‌లో 3,500 కిలోమీటర్ల పొడవున మంచుతుఫాను విశ్వరూపం చూపుతోంది. తూర్పు అమెరికాలో పరిస్థితి భయంకరంగా ఉంది. పెనుగాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు ఎక్కడికక్కడ నేలకొరుగుతున్నాయి.