తెలంగాణలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలి తీవ్రత గత రెండు,మూడు రోజుల నుంచి అధికమవడంతో తెల్లవారుజామున ఇంటినుంచి బయటకు రావాలంటే స్వేటర్ లేకుండా సాధ్యంకాని పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లోనైతే ఏకంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 12గా నమోదయ్యాయి. చలికాలం మొదట్లోనే ఈ పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో చలి తీవ్రత ఏవిధంగా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా వాతావరణ శాఖ విడుదల చేసిన ఉష్ణోగ్రతల ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో భీంపూర్‌లో 12.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు…