ఆస్ట్రేలియా యువ ఓపెనర్ విల్ పుకోవ్‌స్కీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తాను తప్పుకొంటున్నట్లు వెల్లడించాడు. కంకషన్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు 27 ఏళ్ల పుకోవ్‌స్కీ స్పష్టం చేశాడు. తలకు పదే పదే గాయాలవడం అతని కెరీర్‌ను దెబ్బతీసింది. మైదానంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు దాదాపుగా 13 సార్లు కంకషన్‌కు గురైనట్లు సమాచారం. కంకషన్ కారణంగా పుకోవ్‌స్కీ కెరీర్ పూర్తిగా మొదలు కాకముందే.. ముగింపుకు చేరింది. ఇకపై వ్యాఖ్యానం లేదా కోచింగ్ వైపు…