Donald Trump: వైట్ హౌజ్‌లో సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డ్ సెక్యూరిటీ సిబ్బందిపై ఆఫ్ఘాన్ జాతీయుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అన్ని ‘‘మూడో ప్రపంచ దేశాల’’ నుంచి అమెరికాలోకి వలసల్ని శాశ్వతంగా నిలిపివేస్తామని ప్రకటించారు. దీని వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కొలుకుంటుందని చెప్పారు. ట్రంప్ నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా భారీ ప్రభావాన్ని చూపిస్తుంది. మెరుగైన జీవితం, విద్య,…
అగ్ర రాజ్యం అమెరికా పరిపాలన కేంద్రం వైట్‌హౌస్ దగ్గర కాల్పులు తీవ్ర అలజడి రేకెత్తించింది. నేషనల్ గార్డ్స్‌పై ఆప్ఘని వాసి జరిపిన కాల్పులు అధ్యక్షుడు ట్రంప్‌కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఇద్దరు గార్డ్స్‌పై కాల్పులు జరపగా ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇంకొకరు చికిత్స పొందుతున్నారు.
అగ్ర రాజ్యం అమెరికాలో కాల్పులు తీవ్ర కలకలం రేపాయి. వాషింగ్టన్ డీసీలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగి ఉండే వైట్‌హౌస్ దగ్గర ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు నేషనల్ గార్డ్స్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.