ఓ వైపు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం.. ఇంకోవైపు ప్రత్యక్షంగా ఇరాన్‌కు పాకిస్థాన్ సంపూర్ణ మద్దతు. అంతేకాకుండా ఉగ్రవాదానికి పాకిస్థాన్ కేంద్రం అని కూడా తెలుసు. అంతేకాకుండా చైనాకు పాకిస్థాన్ మిత్ర దేశం. ఇన్ని పరిణామాల మధ్య పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌కు వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు ట్రంప్ అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది.