Wheat Price Hike: ప్రస్తుతం సామాన్యుడు బతికే పరిస్థితి కనిపించడం లేదు. గూడు సరే కూడు కోసం కూడా కోటి తిప్పలు పడాల్సి వస్తుంది. నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని చూస్తున్నాయి. పదేళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా బియ్యం ధరలు పెరిగాయి.
సామాన్యులకు మరో షాకింగ్ న్యూస్.. నిన్నటివరకు వంట నూనెల ధరలు కాస్త తగ్గిన విషయం తెలిసిందే.. ఇప్పుడు మరోసారి భారీగా పెరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. వంటనూనె, గోధుమల ధరలు పెంచేందుకు మార్కెట్ సిద్ధం అవుతోంది. ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలు, ప్రతికూల వాతావరణం కారణంగా భారతదేశం సన్‌ఫ్లవర్ ఆయిల్, గోధుమల ధరల పెరుగుదలను ఎదుర్కొంటోంది.. ఈ వార్త సామాన్య ప్రజలకు చేదు వార్త అనే చెప్పాలి.. ఇక పప్పులు, కూరలు, టమోటాలు, పాల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే…