WhatsApp Updates: ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌ల కోసం వాట్సాప్ (WhatsApp) మరోసారి కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఇందులో లైవ్ ఫోటోలు, మెటా ఏఐ ఆధారిత చాట్ థీమ్స్, వీడియో కాల్స్ కోసం బ్యాక్‌గ్రౌండ్ జనరేషన్, డాక్యుమెంట్ స్కానింగ్ వంటివి ఉన్నాయి. వీటి గురించి పూర్తి వివరాలు చూస్తే.. ఇకపై ఐఓఎస్ యూజర్లు లైవ్ ఫోటోలను, ఆండ్రాయిడ్ యూజర్లు మోషన్ ఫోటోలను వాట్సాప్‌లో పంపవచ్చు. లైవ్ ఫోటోలు అంటే, కెమెరా బటన్ నొక్కడానికి ముందు, ఆ తర్వాత కొన్ని…