శ్రావణమాసమంటే పూజలూ పెళ్లిళ్లతో కళకళలాడుతుంది. అందునా ఈరోజు రెండో శుక్రవారం. ఇవాళ లక్ష్మీదేవిని పూజించేందుకు బుధవారం నుంచే భక్తులు మార్కెట్ లో బారులు తీరారు. అమ్మవారికి పూలు, టెంకాయల, అరిటాకులు మొదలగు వస్తువులను కొనేందుకు రెండు రోజుల ముందునుంచే భక్తులు మొదలు పెట్టారు. ఆలయాలకు వెల్లేందుకు ముందుగానే సర్వం సిద్దం చేసుకున్నారు. నిన్న అవసరమైన సరంజామా అంతా తెచ్చేసి, శనగలు నానబెట్టి, నేడు సంతోషంగా, సంబరంగా వరలక్ష్మీ దేవి వ్రతం చేసుకునేందుకు సిద్దమయ్యారు. ఆలయాలకు వెళ్లి పూజలు,…