తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా తీరంలో భారీ తిమింగలం ఒడ్డుకు కొట్టుకురావడం స్థానికంగా సంచలనం రేపింది. మత్స్యకారుల వల్లో చిక్కుకున్న ఈ తిమింగలం సుమారు 10 అడుగుల పొడవు, 2 టన్నుల బరువు కలిగి ఉన్నట్టు అధికారులు తెలిపారు. వలలో చిక్కుకున్న వెంటనే మత్స్యకారులు దానిని విడిపించేందుకు ప్రయత్నించినా, గాయాలు తీవ్రంగా ఉండటం, ఊపిరి ఆడకపోవడం వల్ల అది ప్రాణాలు కోల్పోయింది. తిమింగలం మృతదేహం ఒడ్డుకు కొట్టుకురావడంతో చుట్టుపక్కల గ్రామాల నివాసులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.…