ఏపీ తీరానికి తీవ్ర వాయుగండం ముప్పు పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం బలపడుతోంది. తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాత దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరానికి సమీపిస్తుందని ఐఎండీ అంచనా వేసింది. ప్రస్తుతం తీవ్ర వాయుగుండం మరింత విస్తరిస్తే తుఫాన్‌గా కూడా రూపాంతరం చెందే చాన్స్ కనిపిస్తోంది. మరోవైపు ఈనెల 26న అండమాన్ దగ్గర మరో అల్పపీడనం పుట్టేందుకు అనుకూలమైన వాతావారణం ఉంది. వీటి ప్రభావంతో దక్షిణ కోస్తాలో వచ్చే ఐదు రోజులు భారీ…