దేశ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. దీంతో ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో వాతావరణం కూల్ కూల్‌గా మారిపోయింది. ఇక ఆయా రాష్ట్రాల్లో అయితే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.
హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాలలో మోస్తరు నుంచి భారీగానే వర్షం పడుతోంది. నగరంలోని గచ్చిబౌలి, మాదాపూర్, చందానగర్, మియాపూర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, ఎస్సార్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ, అమీర్ పేట్, భరత్ నగర్, సనత్ నగర్, మారేడ్ పల్లి, బోయిన్ పల్లి, కుత్బుల్లాపూర్,
అనుకున్న సమయానికి ముందే మే 30న కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు... క్రమంగా ముందుకు కదులుతున్నాయి. నైరుతి రుతుపవనాల రాకతో కేరళవ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక, అక్కడ నుంచి కర్ణాటక మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోకి రుతుపవనాలు ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాలు ఏపీని తాకాయి.
Water Crisis : దేశ రాజధాని ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాల్లోనూ విపరీతమైన వేడిగా ఉంది. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. చాలా చోట్ల ఎండ వేడిమికి ప్రజలు తాగునీటికి కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఒకవైపు మాడు పగిలే ఎండ, వడగాల్పులు.. మరోవైపు చెమటలు కారేలా ఉక్కపోతతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈ సారి రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. రికార్డు స్థాయిలో పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం నుంచే భానుడు భగభగమండిపోతున్నాడు. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. సూర్యుడు సుర్రుమంటున్నాడు.
ఐపీఎల్(IPL 2024) ఫైనల్ మ్యాచ్ ఇవాళ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)తో రాత్రి 7.30గంటలకి తలపడబోతుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. మరి మ్యాచ్ జరిగే సమయంలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.
Remal Cyclone : పశ్చిమ బెంగాల్, ఒడిశా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈరోజు, రేపు రెమల్ తుపాను కారణంగా మత్స్యకారులు సముద్రానికి దూరంగా ఉండాలని కోరారు.
నేడు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడు పరిసరి ప్రాంతంలో ఆరించి ఉన్న ఉపరితల ఆవర్తన కారణంగా బుధవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడునున్నట్లు తెలిపింది.