We Hub: అమెరికాకు చెందిన వాల్ష్ కర్రా హోల్డింగ్స్ తెలంగాణలో పెట్టుబడులకు సిద్ధపడింది. రాబోయే అయిదేండ్లలో వీ హబ్లో రూ.42 కోట్ల (5 మిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.
Business Headlines 10-03-23: వి-హబ్ ‘సార్తిక’ లాంఛ్: తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని వి-హబ్.. అంటే.. విమెన్స్ హబ్.. సార్తిక అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం అమలుచేస్తున్న వివిధ పథకాలపై వారికి అవగాహన కల్పించటమే ఈ ప్రోగ్రామ్ లక్ష్యం. కేంద్రం ప్రవేశపెట్టిన.. ప్రధానమంత్రి ఉపాధి అవకాశాల కల్పన పథకం, ముడిపదార్థాల సరఫరా పథకం, బార్‌కోడ్ రిజిస్ట్రేషన్ సబ్సిడీ పథకం వంటివాటిపై తొలుత మహిళా పారిశ్రామికవేత్తల్లో చైతన్యం కల్పించనున్నారు.
మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఒక ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసింది దేశంలో తెలంగాణ మొదటి రాష్ట్రం అని మంత్రి కేటీఆర్ అన్నారు. హోటల్ తాజ్ కృష్ణా వేదికగా వీ హబ్ 5వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.