Water from air: ప్రపంచాన్ని నీటి కొరత సమస్య వేధిస్తోంది. కొన్ని దేశాల్లో నీరు దొరకక ప్రజలు అల్లాడుతున్నారు. అయితే, గాలి నుంచి నీటిని తయారు చేసే సాంకేతిక ఒకటి అందుబాటులోకి రాబోతోంది. విషయం ఏంటంటే, భారతీయ కంపెనీ ‘‘అక్వో’’, గాలి నుంచి నీటిని వెలికితీసే ఒక వినూత్న
సచివాలయంలో మిషన్ భగీరథపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ నీటి సరఫరా వివరాలను మంత్రికి అధికారులు నివేదించారు. ఇప్పటి వరకు ఎక్కడా తాగునీటి సమస్య లేదని అధికారులు తెలిపారు.
Farmers Protest: ఎస్సారెస్పీ కాల్వ ద్వారా సాగునీటిని అందించాలని ఆందోళనకు దిగారు రైతులు. కాలువ ద్వారా సరిపడా సాగునీరు అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని.. డిమాండ్ కు సరిపడ సాగునీటిని అందించి రైతులను ఆదుకోవాలని.. రైతులు సూర్యాపేట జిల్లా ఇరిగేషన్ సీఈ కార్యాలయాన్ని ముట్టడించారు. మోతే, చివ్వెంల, నడిగూడెం.. మండలాలకు చెందిన రైతులు భారీ ఎత్తున తరలిరావడంతో సీఈ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.. యాసంగి పంటకు సాగునీరు ఇవ్వలేమని ఎడ్యుకేషన్ అధికారులు ముందే చెప్పి ఉంటే పంట…
Osmania University: ఉస్మానియా యూనివర్సిటీ మే 1 నుంచి 31 వరకు యూనివర్సిటీ బోర్డర్లకు సెలవు ప్రకటించారు. ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలతో నీరు, విద్యుత్ కొరత తీవ్రంగా ఉందని, బోర్డర్ అందరూ సహకరించాలని కోరారు.
Mumbai: దేశ ఆర్థిక రాజధాని ముంబైకి నీటి కష్టాలు తప్పేలా లేవు. రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో ముంబై మహానగరానికి నీరందించే అన్ని సరస్సుల్లో నీటిమట్టాలు అట్టడుగు స్థాయికి చేరాయి. దీంతో జూలై 1 నుంచి 10 శాతం నీటి కోత విధించాలని బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) నిర్ణయించింది. ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలని కమిషనర్ ఇక్బాల్ సింగ్ విజ్ఞప్తి చేశారు
అసలే ఎండలతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కరీంనగర్ నగర వాసులకు నీటి కష్టాలు చుక్కలు చూపిస్తున్నాయి. నగరంలోని అనేక డివిజన్ లలో ప్రజలు నీటి అవసరాలు తీర్చుకునేందుకు నానా అగచాట్లు పడుతున్నారు.పట్టించుకోవాల్సిన అధికార యంత్రాంగం చోద్యం చూస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్ శివారు గ్రామాలు తాగునీటి సమస్యతో సతమతం అవుతున్నాయి. బిల్లులు సకాలంలో చెల్లించడం లేదనే కారణంతో మిషన్ భగీరథ పనులను గుత్తేదారులు నత్తనడకన చేపట్టడంతో జనాలు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. శివారు గ్రామాలను నగరపాలక…