Minister Seethakka : వచ్చే ఐదు నెలల కోసం మిషన్ భగీరథ సిబ్బంది ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు మంత్రి సీతక్క. వేసవి ముగిసే వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆమె వ్యాఖ్యానించారు. గాలి తర్వాత నీరే మనుషులు కావాలన్నారు. కోట్ల మందికి నీరందించే అదృష్టం మనకే దక్కిందని, ప్రతి మనిషికి 100 లీటర్ల నీటిని ప్రతిరోజు అందించాల్సిందే అని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. గ్రామస్థాయిలో మండల స్థాయిలో క్రీమ్ కమిటీ వేసుకోండని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి…
సమ్మర్ రాకముందే ఎండలు భగ భగ మండిపోతున్నాయి.. అప్పుడే ప్రముఖ నగరాల్లో నీటి కొరత, కరెంట్ కోతలు మొదలైయ్యాయి.. ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.. ముఖ్యంగా కర్ణాటక బెంగళూరులో నీటి కష్టాలు మొదలు అయ్యాయి. ఎండలు ముదరకుండానే మంచి నీటి కోసం కటకట మొదలైంది.. రోజు రోజుకు నీటి కష్టాలు పెరిగిపోతున్నాయి.. ఈ క్రమంలో నగరంలోని షాపింగ్ మాల్స్ లో కొత్త రూల్స్ వచ్చేశాయి.. వాహనాలను కడగడం వంటివి చేస్తే భారీ జరిమానా చెల్లించుకోవాలని అధికారులు…
ప్రసిద్ధ శైవక్షేత్రం కర్నూలు జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా లక్షలాది మంది భక్తులు శ్రీశైలం తరలివస్తున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అధికారులు కూడా భారీ ఏర్పాట్లు చేశారు. అయితే పాతాళ గంగలో నీటిమట్టం భారీగా తగ్గిపోయింది. మెట్ల కిందకు నీటిమట్టం పడిపోవడంతో భక్తులకు నీటికొరత ఏర్పడింది. దీంతో భక్తులు స్నానాలు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే రద్దీ దృష్ట్యా వసతి సౌకర్యం లేకపోవడంతో భక్తులు రోడ్ల మీదే సేద తీరుతున్నారు.…