ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు.. 48 గంటలుగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. ప్రాజెక్టుల గేట్లు తెరచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.
భారీగా కురుస్తున్న వర్షాల వల్ల తెలుగురాష్ట్రాల్లోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. అన్ని ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో ప్రాజెక్టులకు ఇంకా వరద కొనసాగుతోంది. గోదావరి, కృష్ణతో పాటు వాటి ఉపనదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉరకలెత్తుతున్న వాగుల నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకోగా.. చెరువులు, కుంటలు మత్తడి దూకుతున్నాయి.