జలమండలి ఉద్యోగులకు తెలంగాణ రాష్ర్ట సర్కార్ తీపి కబురు చెప్పింది. జలమండలి బోర్డులో పని చేస్తున్న ఉద్యోగులందరికి పీఆర్సీ అమలు చేసేందుకు వీలుగా తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ఆమోద ముద్రను వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేసీఆర్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఈ నెల నుంచే పీఆర్సీ అమలు కానుందని అధికారికంగా తెలిపింది. నవంబర్ మాసం నుంచే వేతనాలను చెల్లించడానికి కేసీఆర్ సర్కార్ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది. గత కొన్ని నెలలుగా జలమండలి…