సూపర్ సిక్స్.. సూపర్ హిట్ అయ్యిందన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..కాకినాడ జిల్లా పెద్దాపురంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర సభలో ఆయన మాట్లాడుతూ.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు.. అంటు వ్యాధులు రావడానికి ప్రధాన కారణం చెత్త, అపరిశుభ్రతేనన్న ఆయన.. గత వైసీపీ ప్రభుత్వం చెత్తపై పన్ను వేసింది.. కానీ, చెత్తను మాత్రం తీయలేదన్నారు.. ప్రజారోగ్యాన్ని వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు..