మూడు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోడీ.. బ్రెజిల్‌లో పర్యటిస్తున్నారు. రియో డీజెనిరోలో జరిగిన జీ-20 సదస్సు నరేంద్ర మోడీ పాల్గొన్నారు. అంతకుముందు అక్కడికి చేరుకున్న ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు. హోస్ట్ బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా డా సిల్వా మోడీకి కరచాలనం చేసి, కౌగిలింతతో స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు చాలా సేపు మాట్లాడుకున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు ప్రధాని మోడీ భుజంపై చేయి వేసి చాలాసేపు మాట్లాడారు.
పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న భారత పురుషుల హాకీ జట్టు శనివారం స్వదేశానికి తిరిగి వచ్చింది. ఢిల్లీ విమానాశ్రయంలో భారత ఆటగాళ్లకు డప్పు వాయిద్యాలతో, పూల మాలలు వేసి ఘన స్వాగతం పలికారు. వేసి ఉదయం నుంచి భారత ఆటగాళ్ల కోసం విమానాశ్రయం లోపల అభిమానులు భారీ సంఖ్యలు వేచి ఉన్నారు. ఆటగాళ్లు ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు భారత ఆటగాళ్లను ఉత్సాహపరిచారు.
మంత్రిగా తొలిసారి కరీంనగర్ వచ్చిన పొన్నం ప్రభాకర్ కి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అల్గునుర్ చౌరస్తా నుంచి తెలంగాణ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. స్వాగత సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగిస్తూ.. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.. నేను మంత్రిని అయినా కరీంనగర్ బిడ్డనే.. ఇక్కడి ప్రజల ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. ఒక రైతు కుటుంబంలో పుట్టిన సాధారణ వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఎంపీని చేసింది, మంత్రిని చేసిందన్నారు.…