రాజోలు నియోజకవర్గంలో ఘర్షణ చోటు చేసుకుంది.. మల్కీపురం మండలం అడవిపాలెం గ్రామంలో ప్రభుత్వ భూమి విషయంలో గ్రామ సర్పంచ్, ఆమె భర్త, వార్డు మెంబర్లపై దాడి జరిగింది.. 2021లో నూతనంగా ఏర్పడింది అడవిపాలెం పంచాయతీ.. అయితే, నూతన పంచాయతీకి భవనం లేకపోవడంతో 1 ఎకరం 96 సెంట్లు ప్రభుత్వ పోరంబోకు భూమిని సర్వే చేస్తున్న సమయంలో రగడ మొదలైంది.. కొంత మంది దళితులు 1 ఎకరం 96 సెంట్లు భూమిని ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి
మనం కొన్ని అంకెల్ని అంతగా ఇష్టపడం. అందులో ముఖ్యమయింది ఏడు. అందుకే గ్రామాల్లో ఆ పదం కూడా వాడరు. ధాన్యం బస్తాలైనా, ఏ వస్తువలైనా లెక్కించేటప్పుడు ఆ పదం పలకరు. ఆరునొకటి అంటారు. అదే సెంటిమెంట్ తూర్పుగోదావరి జిల్లాలోనూ వుంది. కోరుకొండ (మం) బుచ్చెంపేట పంచాయతీ ఏడో వార్డు ఎన్నికకు వింత పరిస్థితి నెలకొంది. వరుసగా మూడోసారి వార్డులో పోటీకి ఎలాంటి నామినేషన్లు రాలేదు. ఏడో వార్డ్ కి మెంబర్ అయితే ప్రాణగండం ఉందంటూ సెంటిమెంట్ వుండడంతో…