నన్నపనేని నరేందర్.. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే. ఇంకొకరు బస్వరాజు సారయ్య, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ. మూడో వ్యక్తి గుండు సుధారాణి, వరంగల్ మేయర్. ఈ ముగ్గురి మధ్య వరంగల్ తూర్ప టీఆర్ఎస్ రాజకీయం ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. కోల్డ్‌వార్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకరంటే ఒకరికి పడదు. ముగ్గురి మధ్య అనేక సందర్భాలలో అభిప్రాయభేదాలు బయటపడ్డాయి కూడా. గత ఏడాది దసరా సమయంలోనే రచ్చ రచ్చ అయింది. తాజాగా పట్టణ ప్రగతి కార్యక్రమం ఆ వర్గపోరును పీక్స్‌కు తీసుకెళ్లడంతో…
తెలంగాణలో జిల్లాల పునర్విభజనలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాను విభజించారు.. ప్రస్తుతం వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ అంటూ.. ఒకే పేరుతో రెండు జిల్లాలు ఉన్నాయి.. అయితే, వరంగల్ అర్బన్‌ను హన్మకొండ జిల్లాగా.. వరంగల్ రూరల్‌ను వరంగల్ జిల్లాగా మార్చనున్నట్టు వెల్లడించారు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. దీనికి సంబంధించిన ఉత్తర్వులు రెండు, మూడు రోజుల్లో వెలువడతాయని తెలిపారు.. వరంగల్ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్.. ఇవాళ వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన…