గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన 15 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే వరంగల్ పశ్చిమ నియోజక వర్గంలో శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం పెద్ద ఎత్తున కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా తూర్పు నియోజక వర్గంలో 15 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆ పార్టీని వీడి.. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ…