Waqf Act: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టంపై పలు రాష్ట్రాల్లో ముస్లింలు ఆందోళన చేస్తున్నారు. బెంగాల్‌లో ఏకంగా ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. ముగ్గురు చనిపోయారు. ఆందోళనల్లో పాల్గొన్న 150కి పైగా వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు, తమ రాష్ట్రంలో వక్ఫ్ చట్టాన్ని అమలు చేసేది లేదని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు.