సొంతగడ్డపై ఎదురులేని భారత్.. న్యూజిలాండ్‌తో మూడు టెస్టు సిరీస్‌ను సునాయాసంగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. టీమిండియాకు ప్రధాన అస్రం అయిన స్పిన్ ఉచ్చులోనే పడి భారత బ్యాటర్లు తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. కివీస్ రెండు టెస్టుల్లోనూ విజయం సాధించి.. భారత గడ్డపై మొదటిసారి టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. నవంబర్ 1 నుంచి ముంబై వేదికగా జరిగే మూడో టెస్టులో అయినా గెలిచి పరువు కాపాడుకోవాలనుకుంటోంది. ఈ క్రమంలోనే పిచ్ విషయంలో టీమిండియా కఠిన నిర్ణయం…