సంక్రాంతి సీజన్ లో కాస్త ముందుగానే మొదలుపెడుతూ మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు తమ సినిమాలతో ఆడియన్స్ ముందుకి వస్తున్నారు. జనవరి 12న బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో థియేటర్స్ లోకి వస్తుంటే ఒక్క రోజు గ్యాప్ తో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. వింటేజ్ వైబ్స్ ఇస్తున్న ఈ రెండు సినిమాలపై తెలుగు రాష్ట్రాల్లో భారి అంచనాలు ఉన్నాయి. చిరు, బాలయ్యల సినిమా రిలీజ్ అంటేనే ఆ హంగామా ఉండడం మామూలే…