పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. విమానాల్లో ఇకపై పేజర్లు, వాకీటాకీలపై నిషేధం విధించినట్లు ఆ సంస్థ తెలిపింది. దుబాయ్‌లో ప్రయాణికుల దగ్గర దొరకడంతో పోలీసులు వాటిని జప్తు చేశారు.
Lebanon Hezbollah: లెబనాన్ లోని సాయుధ సమూహం హిజ్బుల్లా సభ్యుల పేజర్లు, వాకీ టాకీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలలో సంభవించిన పేలుళ్లపై సంస్థ అంతర్గత సైనిక విభాగం యొక్క రహస్య నివేదిక వెలుగులోకి వచ్చింది. 131 మంది ఇరానియన్లు, 79 మంది యెమెన్‌లతో సహా ఆధునిక కమ్యూనికేషన్ పరికరాలలో పేలుళ్ల వల్ల 879 మంది హిజ్బుల్లా సభ్యులు మరణించారని నివేదిక పేర్కొంది. ఇందులో 291 మంది సీనియర్ అధికారులు మరణించారు. ఈ నివేదికను హిజ్బుల్లా నాయకుడు సయ్యద్…
లెబనాన్‌లో తాజాగా వాకీటాకీలు పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరింది. 300 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఆయా ప్రాంతాలు రక్తంతో తడిచిపోయాయి.
లెబనాన్‌ను మరోసారి పేలుళ్లు తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. మంగళవారం పేజర్లు పేలి వేలాది మంది తీవ్ర గాయాలు పాలయ్యారు. ఈ ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే బుధవారం కూడా మరోసారి పేలుళ్లు లెబనాన్‌ను వణికించాయి. తాజాగా వాకీటాకీలు, మొబైల్స్ పేలిపోయాయి. దీంతో వందలాది మంది గాయపడ్డారు.