తమకు వేతనాలు పెంచాలని తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ తరపున అన్ని యూనియన్ నాయకులు తెలుగు సినీ నిర్మాతలకు అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. తెలివిగా బంద్ అని ప్రకటించకుండా వేతనాలు పెంచిన వారి షూటింగ్స్‌కి మాత్రమే వెళతామని వారు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం సరికాదని లేబర్ కమిషనర్ ముందుకు వెళ్లిన ఫిల్మ్ ఛాంబర్ సహా నిర్మాతల మండలి సభ్యులు ఇప్పటికే ఈ విషయం మీద పవన్ కళ్యాణ్‌తో చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు…
తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల వేతనాల పెంపుపై చర్చలు తీవ్రంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి ప్రతినిధులు కార్మిక శాఖ కమిషనర్‌ను కలిసి వేతనాల సమస్యపై చర్చించడానికి రెండు రోజుల గడువు కోరారు. తెలుగు సినీ వర్కర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు కూడా ఈ సమస్యపై కమిషనర్‌తో ఇటీవల సమావేశమై, వేతనాల పెంపు డిమాండ్‌ను గట్టిగా విన్నవించారు. Also Read:Mayasabha: ఆసక్తికరంగా ‘మయసభ’ ట్రైలర్ కార్మిక శాఖ కమిషనర్, ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ ప్రతినిధులకు…