North Korea: ఉత్తర కొరియా ప్రపంచంలోనే ఓ నిగూఢ దేశం. నిజానికి ఆ దేశ ప్రజలకు బయట ఒక ప్రపంచం ఉందని తెలియదంటే అతిశయోక్తి కాదు. కేవలం నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చెప్పేదే న్యాయం, చేసేదే చట్టం అక్కడ. తన తాత, తండ్రులే అక్కడ దేవుళ్లు. ఇంతలా అక్కడి ప్రజలు అణిచివేతకు గురవుతున్నారు. శిక్షల్లో, వింత వింత రూల్స్‌కి నార్త్ కొరియా పెట్టింది పేరు.