ఎన్నికల సమయంలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు ఉద్యోగాల నుంచి తొలగిస్తోందని.. 410 మంది ఉద్యోగులను ఫైబర్ నెట్ నుంచి తొలగిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడ్డారు. నిరుద్యోగులకు ఇస్తాం అని చెప్పిన భృతి ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు.
ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది, 7,218 గ్రామ, వార్డు వాలంటీర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. తాజా పోస్టులను జిల్లా యూనిట్‌గా భర్తీ చేయాలని ప్రభుత్వం సూచించింది. గతంలో మండల, పట్టణ యూనిట్‌గా వాలంటీర్లను నియమించగా.. ఇప్పుడు గ్రామాల్లో 4,213, పట్టణాల్లో 3,005 వాలంటీర్ల ఖాళీల భర్తీకి జిల్లాను యూనిట్‌గా తీసుకోవాలని తెలిపింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.…