రోజు రోజుకు పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో అందరి చూపు ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ)పై పడుతోంది. వినియోగదారులకు అనుగుణంగానే అందుబాటులోకి ప్రముఖ కార్ల తయారీ సంస్థలు ఈవీ కార్ల తయారీపై మొగ్గుచూపుతున్నాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రముఖ జర్మనీ కార్ల తయారీ సంస్థ వోక్స్ వ్యాగన్ ఏజీ భారత విపణిలోకి వచ్చే ఏడాది తొలి విద్యుత్ కారు ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. `ఐడీ.4` అనే పేరుతో వచ్చే స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (ఎస్‌యూవీ) కారును వచ్చే ఏడాది పరిమితంగా…