ప్రస్తుతం టెలికాం రంగంలో వొడాఫోన్ ఐడియా నష్టాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ సంస్థను బలోపేతం చేసేందుకు సంస్థ ప్రతినిధులు కష్ట పడుతున్నారు. దేశంలో జియో, ఎయిర్ టెల్ లతో వీఐకి గట్టి పోటీ ఉంటుందని.. వాటి ద్వారా తమ సంస్థ చాలా మంది వినియోగదారులను కోల్పోయిందని ఆదిత్యా బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా అన్నారు.
ప్రముఖ టెలికాం కంపెనీ ‘వొడాఫోన్ ఐడియా’ కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఓటీటీలకు ఆదరణ ఉన్న నేపథ్యంలో వినియోగదారులకు ఆ సేవల్ని అందించడానికి కొత్త ప్లాన్‌ను విడుదల చేసింది. ఆ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ రూ.169. వొడాఫోన్ ఐడియా అందుబాటులోకి తెచ్చిన ఈ కొత్త ప్లాన్ డీటెయిల్స్ ఓసారి చూద్దాం. Also Read: Bengaluru Water Crisis: బెంగళూరులో నీటి సంక్షోబానికి కారణం ఏంటో తెలుసా? వొడాఫోన్ ఐడియా కొత్తగా తీసుకొచ్చిన…
Vodafone Idea Share: ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న.. దేశంలోని మూడో అతిపెద్ద టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా స్టాక్ గత ఆరు నెలల్లో ఇన్వెస్టర్లకు బలమైన రాబడులను అందించింది.
Vodafone Idea: అప్పుల ఊబిలో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియా స్పెక్ట్రమ్ వేలం విడతగా సుమారు రూ.1,680 కోట్లు చెల్లించేందుకు మరో 30 రోజుల గడువు కోరినట్లు వొడాఫోన్ ఐడియా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
Job Opportunity: దేశంలోని టెలికాం రంగంలో త్వరలో భారీ సంఖ్యలో ఉద్యోగ నియామకాలు రానున్నాయి. రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్ వంటి దిగ్గజ కంపెనీలు త్వరలో తమ ఉద్యోగులను 25 శాతం వరకు పెంచుకోనున్నాయి.
Vodafone Idea Q1 Results: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా కష్టాలను తగ్గేలా కనిపించడం లేదు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నష్టాలు మళ్లీ పెరిగాయి.
రిలయన్స్ జియోతో ఇంటర్‌కనెక్ట్ పాయింట్లను తిరస్కరించినందుకు టెల్కోకు రూ. 2,000 కోట్ల జరిమానా విధించే విధంగా టెలికాం రెగ్యులేటర్ చేసిన సిఫార్సుపై వోడాఫోన్ ఐడియా చేసిన అప్పీల్‌ను ఢిల్లీ హైకోర్టు బుధవారం తోసిపుచ్చింది.
Airtel Vs Jio: జియో, ఎయిర్‌టెల్ మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ 2 సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నాయి. 5జీ యూజర్ల కోసం అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తున్నాయి. జియో ఇప్పటికే ఈ సర్వీసును ప్రారంభించింది. తాజాగా.. ఎయిర్‌టెల్ సైతం ఇదే ప్రకటన చేసింది. పోస్ట్ పెయిడ్ కస్టమర్లు మరియు 239 రూపాయలు అంతకన్నా ఎక్కువ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకునే ప్రీపెయిడ్ కస్టమర్లు ఇకపై అపరిమితంగా డేటా వాడుకోవచ్చని తెలిపింది.
Today (28-01-23) Business Headlines: పెరిగిన జియో, ఎయిర్’టెల్ కస్టమర్లు: గతేడాది నవంబర్’లో రిలయెన్స్ జియో మరియు ఎయిర్’టెల్’కి పాతిక లక్షల మంది వినియోగదారులు పెరిగారు. వొడాఫోన్ ఐడియాకి మాత్రం 18 లక్షల మందికి పైగా తగ్గారు. ఈ విషయాలను టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. రిలయెన్స్ జియో 14 లక్షల 26 వేల మందిని, ఎయిర్’టెల్ 10 లక్షల 56 వేల మందిని కొత్తగా చేర్చుకున్నాయి.
కొత్త సంవత్సరం ప్రారంభమైంది.. ప్రీపెయిడ్ వినియోగదారులు కొందరు లాంగ్ టర్మ్ ప్లాన్స్ కోసం చూస్తూ ఉంటారు.. ఒక్కసారి రీచార్జ్ చేస్తే.. ఏకంగా ఏడాది పాటు మళ్లీ చూసుకోవాల్సిన అవసరం లేకుండా.. బెస్ట్ వార్షిక ప్లాన్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.. టెలికం మార్కెట్‌లో దిగ్గజ సంస్థలైన జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా దాదాపు ఒక సంవత్సరం చెల్లుబాటు అయ్యే ప్లాన్స్పై అన్‌లిమిటెడ్ టాక్ టైం అందుస్తున్నాయి.. ఈ దీర్ఘకాలిక ప్లాన్లలో అపరిమిత కాలింగ్, డేటా ప్రయోజనాలు మరియు ఓటీటీ ఆఫర్లతో…