విశాఖలో స్పా పేరుతో అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్న సెంటర్‌ను సీజ్ చేశారు పోలీసులు. నిర్వాహకులతో పాటు అరెస్ట్ చేశారు. అయితే.. ఉద్యోగాల పేరుతో యువతులను తీసుకొచ్చి, తర్వాత బలవంతంగా వ్యభిచారం కూపంలోకి దించుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆన్‌లైన్, సోషల్ మీడియా, ఫోన్ కాల్స్ ద్వారా ప్రచారం చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ఈ అక్రమ దందాపై విశాఖ పోలీసులు కన్నెర్ర చేశారు. Read Also: Hyderabad: నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే.. కత్తితో పొడిచి దారుణ హత్య.. కేసులో బిగ్‌ట్విస్ట్…
ఇకపై విశాఖ నగరాన్ని బెగ్గర్ ఫ్రీ సిటీగా చూస్తామంటున్నారు విశాఖ పోలీస్ బాస్ శంఖ భ్రత బాగ్చి.. ఇందులో భాగంగా 243 మంది యాచకులను రెస్క్యూ చేసి వారికి ఆశ్రయం కల్పించారు.. జ్యోతిర్గమయ్య కార్యక్రమంలో అమలు చేస్తున్నామని తెలిపారు.. చీకటి నుంచి వెలుతురు వైపు ప్రయాణం చేసేందుకు బిక్షాటన చేసే వారికి, నిరాశ్రయులకు షెల్టర్ కల్పించి వారి జీవితాల్లో మరో కొత్త లైఫ్ జర్నీని ప్రారంభించనున్నారు.. రోజు ఎంతో మంది భిక్షాటన చేస్తూ, నిరాశ్రయులుగా రోడ్డు మీద…
విశాఖ లోని అయోధ్య రామ మందిరం నమూనా సెట్ నిర్వాహకులకు ఉచ్చు బిగుస్తుంది.. ఆధ్యాత్మిక ముసుగులో కమర్షియల్ గా నిర్వహిస్తున్న రామ మందిరం వివాదం ముదురుతుంది.. అయోధ్య రామ మందిరం నిర్వాహకులపై రెండు ఫిర్యాదులు అందుకున్నారు విశాఖ త్రీ టౌన్ పోలీసులు.. ముగ్గురు నిర్వహకులుపై 318(4) r/w 3(5) BNS కింద త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు..
విశాఖలో కలకలం రేపిన దువ్వాడ జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు.. దువ్వాడ పీఎస్ పరిధిలో జరిగిన వృద్ధ దంపతుల డబుల్ మర్డర్ కేసులో నిందితుడ్ని అరెస్ట్ చేశారు పోలీసులు.. అప్పు తీర్చాలని అడిగినందుకు యోగేంద్ర బాబు, లక్ష్మీల హత్య చేసినట్లు విచారణలో తేల్చారు పోలీసులు.. మరోవైపు, భీమిలి మండలం దాకమర్రి వివాహిత హత్య కేసును కూడా పోలీసులు ఛేదించారు.. హత్య చేసిన క్రాంతి కుమార్ ను అరెస్టు చేశారు.
సాగర నగరం విశాఖపట్నంలో బైక్ రేసింగ్‌లకు కళ్లెం వేయడానికి సీసీ శంఖ బ్రతబాగ్చి దృష్టిసారించారు. వీకెండ్స్‌లో బైక్‌రేసింగ్‌లు ఎక్కువగా జరుగుతుండడంతో ప్రత్యేక నిఘా పెట్టాలని సిబ్బందిని ఆదేశించారు. గతవారం రోజుల్లోనే 54 మంది రేసర్లను పోలీసులు పట్టుకున్నారు. గతంలో నగరశివారు ప్రాంతాల్లో అకస్మాత్తుగా జరిగే రేసింగ్‌లు.. వీకెండ్స్‌లో సాధారణంగా మారిపోయాయి.
విశాఖలోని ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక భారీ కంటైనర్ పట్టుబడింది. ఈరోజు ఉదయం శ్రీకాకుళం జిల్లా పలాసలో వేకువజామున ఒక కంటైనర్ గంజాయి లోడుతో వెళ్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఈబీ పోలీసులు తనిఖీలు చేపట్టారు.
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం ఘటనలో మరో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. అగ్నిప్రమాదం, బోట్లు తగలబడిపోయిన ఘటనలో పోలీసులు అనుమానితుడిగా భావించిన యూట్యూబర్, లోకల్‌బాయ్ నాని.. హైకోర్టు మెట్లు ఎక్కారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో బోట్లు కాలిపోయిన ఘటనలో పోలీసులు తనను మూడు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించారంటూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు నాని..