విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. నేటితో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటివరకు రెండు నామినేషన్లు మాత్రమే దాఖలు అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు మరో మూడు శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు.. ఇవాళ హైదరాబాద్ నుంచి అమరావతికి చేరుకోన్న ఆయన.. ఉదయం 11 గంటలకు సెక్రటేరీయేట్‌కు వస్తారు.. ఇక, వివిధ శాఖపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు.. వైద్య-ఆరోగ్య శాఖ, రవాణా శాఖ, యువజన మరియు క్రీడల శాఖలపై ఈ రోజు సీఎం రివ్యూ చేస్తారు. నూతనంగా తీసుకువస్తున్న ఇండస్ట్రియల్ పాలసీపై అధికారులతో చర్చిస్తారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు..
విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారు.. ఈ రోజు విశాఖ నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. అయితే, ఆ సమావేశం ముగిసిన తర్వాత హైదరాబాద్ బయల్దేరి వెళ్లారు చంద్రబాబు.. కానీ, టీడీపీలో ఇంకా విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక పంచాయతీ తేలనట్టుగా తెలుస్తోంది.