Minister BC Janardhan Reddy: గూగుల్ తో చారిత్రక ఒప్పందం చేసుకోవడంపై మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు మార్గ దర్శకత్వంలో యువనేత లోకేష్ కృషితో ఏపీకి గూగుల్ కంపెనీ రావడం అభినందనీయం అన్నారు.
త్వరలోనే విశాఖ ఐటీ హబ్‌గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విశాఖకు గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సంచర్ కంపెనీలు వస్తున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.6.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 125 కంపెనీలు వచ్చాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని సీఎం చెప్పుకొచ్చారు. పర్యాటక ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జలాశయాలు నిండుగా ఉన్నాయన్నారు. టెంపుల్ టూరిజంను 8 నుంచి 20 శాతానికి పెంచాలనేది లక్ష్యం అని, పర్యాటకంలో…