గత కొద్ది రోజుల నుండి విశాఖ బీచ్ రోడ్డులో హల్ చల్ చేస్తున్న బైక్ రేసర్ల భరతం పట్టారు పోలీసులు. ఎన్టీవీలో ప్రసారం అయిన వార్తలకు స్పందన లభించింది. వరుస కథనాలతో పోలీస్ యంత్రాంగం కదిలింది. నగరంలో పలు చోట్ల నిఘా పెట్టి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేశారు. బైక్ రేసింగ్లకు పాల్పడుతున్న యువకులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు పోలీసులు. విశాఖలో బైక్ రేసింగ్‌లపై పోలీస్ కమిషనర్ సీరియస్ అయ్యారు. బీచ్ రోడ్లు, ఖాళీ ప్రదేశాల్లో మోడల్…