యువ హీరో విశ్వక సేన్ పారితోషికం పెంచాడా? అంటే అవుననే వినిపిస్తోంది. విశ్వక్ నటించిన తాజా చిత్రం ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ ఓ మాదిరిగా నడిచింది. అదీ విడుదలకు ముందు వివాదం పుణ్యమా అని. థియేట్రికల్ రన్ పరంగా ఆకట్టుకోలేక పోయినా డిజిటల్, శాటిలైట్ రైట్స్ అన్నీ కలుపుకుని నిర్మాతలు బయటపడ్డారు. ఇప్పుడు విశ్వక్ నటించిన ‘ఓరి దేవుడా’ సినిమా ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఆ తర్వాత సొంత దర్శకత్వంలో ‘ధమ్కీ’ సినిమా చేయబోతున్నాడు.…