ఆ సీనియర్ ఎమ్మెల్యే మిత్రపక్షాలను గట్టిగా టార్గెట్ చేయడం వెనక ఆంతర్యం ఏంటి? చేతకాకుంటే సన్యాసం తీసుకోవాలన్న మాటలు ఆయన నోటి నుంచి ఎందుకు వచ్చాయి? ఆ కాషాయ నేత కొత్త అగ్గి రాజేస్తున్నారా? అసలు ఆయన కోపానికి కారణం ఏంటి? ఎవరి భుజం మీద తుపాకీ పెట్టి ఎవర్ని కాల్చాలనుకుంటున్నారు? పెన్మత్స విష్ణుకుమార్ రాజు. విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అండ్ బీజేఎల్పీనేత. వైసీపీ అంటే అస్సలు గిట్టదని చెప్పుకుంటారు. అంతర్గతంగా పరిచయాలు ఎలా వున్నా……
సీఎం వైఎస్ జగన్ 10 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్న విషయం వైసీపీ నాయకులు గుర్తించాలి అని రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు తెలిపారు. నార్త్ కొరియా నియంత కిమ్ కంటే జగన్మోహన్ రెడ్డి ప్రమాదకరంగా తయారయ్యాడు..
జగన్ ఎప్పుడు జైలుకు పోతారో తెలియదని..రాబోయేది జగన్ కు ఒడిదుడుకుల సమయమని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు. జగనే కాకుండా ఎవరు ఎప్పుడు జైలుకు వెళతారో తెలియదని పేర్కొన్నారు. ఎప్పుడూ వినని వందల రకాల మద్యం బ్రాండ్స్ వున్నాయని… అడిగే వాడే లేడని పెంచి అమ్ముతున్నారని మండిపడ్డారు. మద్యం ప్రియులను దోచేస్తూ వారి నుంచి వచ్చే డబ్బులతో ప్రభుత్వం నడుపుతున్నారు..కొన్న దానికన్నా పది రెట్లు ఎక్కువ చేసి మద్యాన్ని అమ్ముతున్నారని ఆగ్రహం…