తాజాగా తమిళ ‘మధగజరాజా’ ప్రమోషన్‌లో విశాల్ పరిస్థితి చూసి చాలా మంది షాక్ అయ్యారు. సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మధగజరాజా’ దాదాపు 12 ఏళ్ల తర్వాతవిడుదలవుతోంది. దీని ప్రమోషనల్ ఈవెంట్ నిన్న చెన్నైలో జరిగింది. అందులో పాల్గొన్న విశాల్ ఆరోగ్యం చాలా విషమించింది. మైక్ చేతిలో పట్టుకుని మాట్లాడలేకపోయాడు, ఆయన చేయి వణుకుతోంది. విశాల్ ప్రసంగం ముగించిన తర్వాత, హోస్ట్ మాట్లాడుతూ “విశాల్‌కి వైరల్ ఫీవర్ ఉంది. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌కి జ్వరం ఉన్నా…