విశాఖలోని రిఫైనరీ ప్రాజెక్టును రూ.26,264 కోట్లతో ఆధునీకరించి విస్తరణ చేపట్టాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సోమవారం రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి రామేశ్వర్ ఈ విషయాన్ని తెలియజేశారు. ఇందుకు హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) అంగీకారం తెలిపిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం పూర్తయితే రిఫైనరీ సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 8.3 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 15 మిలియన్ మెట్రిక్ టన్నులకు…