మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ నిర్వహించాలి అన్నారు సీఎం చంద్రబాబు.. విశాఖపట్నంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా డే ను రికార్డు సృష్టించేలా నిర్వహించాలని అన్నారు. జూన్ 21వ తేదీన జరిగే యోగా డే కార్యక్రమంలో ప్రధాని మోడీ ఈసారి విశాఖలో పాల్గొంటున్నారు.
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో నేటి నుంచి హాస్టళ్లు తాత్కాలికంగా మూసివేశారు వర్సిటీ అధికారులు.. భారత్-పాక్ యుద్ధం కారణంగా విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని పరీక్షలు ముగిసిన వారు వెంటనే ఇళ్లకు వెళ్లిపోవాలని స్పష్టం చేశారు.
Crime: విశాఖపట్నంలో సంచలనం రేపిన వివాహిత హత్య కేసును భీమిలి పోలీసులు ఛేదించారు. మహిళతో సన్నిహితంగా ఉన్నవాడే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో అనుమానితుడు క్రాంతి కుమార్ అనే వ్యక్తిని అదుపులో తీసుకున్నారు.
Crime News: గ్రేటర్ విశాఖపట్నం నగర శివారు ప్రాంతాల్లో గుర్తు తెలియని మృతదేహలు కలకలం రేపుతున్నాయి. నిర్మానుష్య ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు స్థానిక ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి.
బెట్టింగ్ యాప్‌లు ప్రాణాలు తీస్తూనే ఉన్నాయి.. బెట్టింగ్ యాప్‌లలో డబ్బులు పెట్టి సంపాదిస్తామన్న ఆశతో వాటి మోజులో పడి.. ఉన్న డబ్బునంతా పోగొట్టుకోవడమే కాదు.. అప్పులు చేసి మరి బెట్టింగ్‌లు పెట్టి.. చివరకు లక్షల్లో అప్పులు కావడం.. తీర్చే స్తోమత కూడా లేకుపోవడంతో.. ప్రాణాలు తీసుకుంటున్నారు ఎంతో మంది యువకులు.. తాజాగా, బెట్టింగ్ యాప్ లకు విశాఖపట్నంలో మరో యువకుడు బలి అయ్యాడు..
విశాఖలో మళ్లీ వర్షం మొదలైంది. ఇప్పటికే సింహాచలం అప్పన్న సన్నిధిలో భారీగా భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు. వర్షం కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక కొండ దిగువున బస్సులు దొరక్క భక్తులు అవస్థలు పడుతున్నారు
VIzag: ప్రస్తుత దేశ పరిస్థితుల్లో అత్యవసర సమయాలను ఎదుర్కొనేందుకు తూర్పు నావికాదళం (Eastern Naval Command) పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని అర్థమవుతుంది. పరిస్థితి ఏదైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని సన్ రైజ్ ఫ్లీట్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఈ నేపధ్యంలో తూర్పు నావికాదళాధిపతి (ENC Chief) వైస్ అడ్మిరల్ పెందార్కర్ పరిస్థితిని సమీక్షించారు. సముద్ర మార్గంలో పెరుగుతున్న టెన్షన్‌ను దృష్టిలో పెట్టుకుని తగిన అప్రమత్తత తీసుకోవాలని సమీక్ష సమావేశంలో ఆయన సూచించారు. అత్యవసర పరిస్థితుల…
విశాఖలో కలకలం రేపుతున్న స్కూల్ విద్యార్ధిని మృతి కేసు కలకలం రేపుతోంది. తల్లీ, అమ్మమ్మలపై అనుమానం వ్యక్తమవుతోంది.. జ్ఞానపురంలోని చర్చిలో 11 ఏళ్ల మైనర్ బాలిక అనుమానాస్పదంగా మృతి చెందింది. 5th టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతిపై తండ్రి పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాలి సోకిందని పూజలు చేయించడానికి బాలిక తల్లి, అమ్మమ్మ చర్చికి తీసుకొచ్చారు. తండ్రికి తెలియకుండా చర్చికి తీసుకొచ్చారు. బాలిక…
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు, అవిశ్వాస తీర్మానాల సమయంలో పార్టీకి నిలబడి ధైర్యంగా పోరాడిన ప్రజాప్రతినిధులందరికీ సెల్యూట్ చేస్తున్నానని జగన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు యుద్ధవాతావరణాన్ని తలపిస్తున్నాయని, ప్రజలు అత్యంత కష్టాల్లో ఉన్నారని ఆయన ఆరోపించారు. “ఇది దుర్మార్గమైన రెడ్‌బుక్ పాలన. ప్రజావ్యతిరేకతను ఎంత అణిచివేయాలనుకున్నా సాధ్యం కాదు” అని…
NDA Corporators: గ్రేటర్ విశాఖ మేయర్ పదవిని గెలిచి సీఎం చంద్రబాబుకి పుట్టినరోజు కానుకగా ఇచ్చామని కూటమి కార్పొరేటర్లు పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీన డిప్యూటీ మేయర్ పై జరిగే అవిశ్వాస తీర్మానాన్ని కూడా మేమే గెలుచుకుంటాం అని ధీమా వ్యక్తం చేశారు.