విశాఖపట్నం మధురవాడలోని శ్రీ తనుష్ పాఠశాలలో అమానుష ఘటన చోటుచేసుకుంది... సదరు పాఠశాలలో 8వ తరగతి చదువుతోన్న విద్యార్థి చేయి విరగొట్టాడు ఉపాధ్యాయుడు.. ఇనుప బల్ల కేసి చితకబాది.. ఆపై పిడుగులు గుద్ధి చేయి విరగగొట్టాడు అని విద్యార్థి తల్లితండ్రులు చెబుతున్నారు.. ఈ ఘటనలో మూడు చోట్ల బాలుడి ఎముకలు విరిగాయి.. దీంతో, శస్త్ర చికిత్స కోసం విద్యార్థిని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు.. విద్యార్థిపై దాడికి కారణమైన సోషల్ మాస్టర్ మోహన్.. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు..
విశాఖ పోలీస్ కమిషనరేట్ కు సమీపంలో కురుస్తున్న వర్షాలకు బాగా తడిసిన ఆరడుగుల ఎత్తు 30 మీటర్ల పొడవున్న ఓ గోడ కూలిపోయింది.. వినాయక మండపంతో పాటు సమీపంలోనే ఉన్న చిన్న చిన్న షాప్స్, బైక్ ల మీద పడడంతో ధ్వంసం అయ్యాయి.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. నేడు విశాఖపట్నం వెళ్లనున్నారు.. గత ఎన్నికల్లో కూటమి విజయంలో కీలక భూమిక పోషించింది జనసేన.. ఆ తర్వాత కీలకమైన డిప్యూటీ సీఎం పదవి కూడా జనసేనాని వరించింది.. ఓ వైపు కూటమి సర్కార్లో కీలక శాఖలు నిర్వహిస్తూనే.. మరోవైపు పార్టీ బలోపేతంపై దృష్టిసారించారు పవన్ కల్యాణ్.. దీనికోసం విశాఖ వేదికగా మూడు రోజుల పాటు జనసేన విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించబోతున్నారు..
Rajnath Singh: నేడు విశాఖపట్నంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన రెండు యుద్ధ నౌకలను దేశానికి అంకితం చేశారు. దీనితో విశాఖపట్నంలోని తూర్పు నావికాదళ శక్తి మరింతగా పెరిగింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి అనే రెండు యుద్ధ నౌకలను దేశానికి అంకితం చేశారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ నౌకలు భారత సాంకేతిక సామర్ధ్యానికి ప్రతీకగా నిలవనున్నాయి. Ganesh Idol Trunk: గణపయ్య…
2026లో జరిగే 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ సదస్సుకు పర్యాటకుల గమ్యస్థానమైన విశాఖపట్నం అతిథ్యం ఇవ్వనుందని రాష్ట్ర పర్యాటక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ప్రకటించారు. ఈ నెల 22 నుండి 24 వరకు ఒడిశాలోని పూరీలో స్వోస్తి ప్రీమియం బీచ్ రిసార్ట్స్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 40వ ఐఏటీఓ వార్షిక సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం తరపున టూరిజం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ పాల్గొన్నారు. Also Read:Missing Plane…
Minister Anagani: మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎన్టీవీతో మాట్లాడుతూ.. స్త్రీ శక్తి పథకం కారణంగా ఇవాళ విడుదల చేయాల్సిన కొత్త పాస్బుక్ల ఆవిష్కరణ వాయిదా పడిందని చెప్పుకొచ్చారు. వారం లేదా 10 రోజుల లోపులో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ పాస్బుక్లను ఆవిష్కరిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.
ఇకపై విశాఖ నగరాన్ని బెగ్గర్ ఫ్రీ సిటీగా చూస్తామంటున్నారు విశాఖ పోలీస్ బాస్ శంఖ భ్రత బాగ్చి.. ఇందులో భాగంగా 243 మంది యాచకులను రెస్క్యూ చేసి వారికి ఆశ్రయం కల్పించారు.. జ్యోతిర్గమయ్య కార్యక్రమంలో అమలు చేస్తున్నామని తెలిపారు.. చీకటి నుంచి వెలుతురు వైపు ప్రయాణం చేసేందుకు బిక్షాటన చేసే వారికి, నిరాశ్రయులకు షెల్టర్ కల్పించి వారి జీవితాల్లో మరో కొత్త లైఫ్ జర్నీని ప్రారంభించనున్నారు.. రోజు ఎంతో మంది భిక్షాటన చేస్తూ, నిరాశ్రయులుగా రోడ్డు మీద…
Srushti Fertility Case: వైద్య వర్గాల్లో ‘సృష్టి’ ఫెర్టిలిటీ కేసు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు వేగం పెంచింది. తాజాగా ఈ కేసులో విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)కు చెందిన ఇద్దరు వైద్యులను గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో మత్తు వైద్య విభాగాధిపతి డాక్టర్ వాసుపల్లి రవి కుమార్, ప్రసూతి విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉషాదేవి ఉన్నారు. ఇక వాసుపల్లి రవి కుమార్ మాజీ ఎమ్మెల్యే…
విశాఖపట్నంలో భారీ పేలుడు సంభవించింది.. విశాఖ ఫిషింగ్ హార్బర్ ఏరియాలో ఈ పేలుడు ఘటన చోటు చేసుకుంది.. విశాఖపట్నం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాలయ బార్ దగ్గర గ్యాస్ సిలిండర్ పేలడంతో.. ముగ్గురు మృతిచెందారు.. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయినట్టుగా తెలుస్తోంది.