ప్రభుత్వ మద్యం షాపుల్లో నగదు అవకతవకలపై లోతైన విచారణ జరపనున్నారు. విశాఖ సర్కిల్-4పరిధిలో నాలుగు షాపుల్లో నగదు పక్కదారిపట్టి నట్టు నిర్ధారణ అయింది. మొత్తం 33లక్షల రూపాయలు నొక్కేసారు సిబ్బంది. ఇందులో బాధ్యులైన సిఐ శ్రీనివాస్ ను విధుల నుంచి తప్పించారు ఉన్నతాధికారులు. ఇద్దరు కానిస్టేబుళ్లపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. జిల్లాలో స్పెషల్ డ్రైవ్ కు ఆదేశించిన అధికారులు.. సూపర్ వైజర్లు, వైన్ షాప్ సిబ్బంది ని విచారిస్తున్నారు. ఇంకా 12మంది సిబ్బందికి నోటీసులు ఇచ్చాము. నిధులు రికవరీ తర్వాత క్రిమినల్ కేసులు పెడతాం అని ఎక్సయిజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు పేర్కొన్నారు.