విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు తల పెట్టిన సమ్మె వాయిదా వేశారు.. వేతన ఒప్పందం అమలు కోసం ఈ నెల 31వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లనున్నట్టు మొదట నోటీసులు ఇచ్చింది అఖిలపక్షం.. అయితే, కార్మిక సంఘాలతో ఇవాళ కార్మిక శాఖ జాయింట్ కమిషనర్, ఆర్.ఐ.ఎన్. ఎల్.యాజమాన్యం చర్చలు జరిపింది.. ఇరువర్గాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.. అయితే, ఆ తర్వాత ఈ నెల 31వ తేదీ నుంచి తలపెట్టిన సమ్మెను వాయిదా వేస్తున్నట్టు…
విశాఖ ఉక్కు ప్రవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి పోరాటం చేస్తోంది. వారికి సంఘీభావం తెలిపేందుకు విశాఖకు చేరుకున్న పవన్.. కూర్మన్నపాలెం వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఏపీ ప్రభుత్వం కృషి చేయాలన్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంతో విన్నవించి విశాఖ ప్రైవేటీకరణను ఆపాలని కోరారు. అవసరమైతే సీఎం జగన్ అఖిలపక్షాన్ని పిలవండి అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రతి యువకుడు జైతెలంగాణ…
విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం ప్రైవేటీకరించనున్నట్లు ప్రకటించింది. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయకుండా ఉండాలని విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలో సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉక్కు పరిరక్షణ సమితికి సంఘీభావం తెలుపేందుకు ఈ రోజు విశాఖకు చేరుకున్నారు. ఈ క్రమంలో కూర్మన్నపాలెం వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. విశాఖకు చేరుకున్న జనసేనాని సభాస్థలికి చేరుకోనున్నారు. అనంతరం ఉక్కు కార్మికులకు…
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విశాఖ పర్యటన ఖరారైంది… జనసేనాని పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది ఆ పార్టీ.. ఉక్కు పరిరక్షణ పోరాట ఉద్యమానికి సంఘీభావం తెలపనున్న పవన్ కల్యాణ్.. ఈనెల 31 మధ్యాహ్నం ఉక్కు పరిరక్షణ సభలో పాల్గొంటారని వెల్లడించింది.. కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వడివడిగా అడుగులు వేస్తుండగా… విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ సాధించుకున్న స్టీల్ ప్లాంట్‌ను వదులుకోవడానికి సిద్ధంగాలేని కార్మిక, ప్రజాసంఘాలు ఆందోళన చేస్తూ వస్తున్నాయి.. వారికి…