Iran: భారతీయ సందర్శకులకు ఇరాన్ గుడ్ న్యూస్ చెప్పింది. తమ దేశానికి వచ్చే భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వచ్చే సందర్శకుల వీసా నిబంధనలను ఏకపక్షంగా రద్దు చేయాలని ఇరాన్ మంత్రివర్గం నిర్ణయించిందని ఇరాన్ సాంస్కృతిక వారసత్వం, పర్యాటక మంత్రి ఎజ్జతోల్లా జర్ఘామి తెలిపారు. భారత్‌తో సహా 33 దేశాలకు వీసా నిబంధనలను రద్దు చేస్తూ ఇరాన్ బుధవారం నిర్ణయం తీసుకుంది.