కరోనా మహమ్మారి ఇంకా అదుపులోకి రాలేదు.. ప్రపంచవ్యాప్తంగా థర్డ్ వేవ్ హెచ్చరికలు కలవరపెడుతున్నాయి.. ఇక, థర్డ్ వేవ్ ఎక్కువ చిన్నారులపైనే ప్రభావం చూపబోతుందంటూ పలు హెచ్చరికలు ఉన్నాయి.. అయితే, పెద్దవారి ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతోన్న మహమ్మారి.. చిన్నారులపై ఊపిరితిత్తులను ఏ స్థాయిలో దెబ్బతీస్తుందనేదానిపై అధ్యయనం చేశారు శాస్త్రవేత్తలు.. కానీ, కోవిడ్ వల్ల చిన్నారులు, కౌమారప్రాయుల్లో ఉన్నవారి ఊపిరితిత్తులపై పెద్దగా ప్రభావం చూపదని.. కోవిడ్ బారినపడినా.. వారి అవయవాల పనితీరులో పెద్దగా మార్పులు రావని గుర్తించారు శాస్త్రవేత్తలు.…