VC Sajjanar : టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మరోసారి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని, విధుల్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ఆయన పేర్కొంటూ, “ఇదేం వెర్రి కామెడీ!? సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఎన్ని పిచ్చివేషాలైన…